సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రపురంలో గల సంగీత థియేటర్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సును అధిగమించబోయిన ఓ ద్విచక్ర వాహనదారుడు అదుపుతప్పి బస్సును ఢీకొట్టాడు. ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు సంగారెడ్డి జిల్లాకు చెందిన కుమార్, వెంకటేశ్‌లుగా పోలీసులు గుర్తించారు.
అధిగమించబోయి.. అనంతలోకాలకు - latest news about accident at ramachandrapuram in sangareddy district
ఆర్టీసీ బస్సును అధిగమించబోయిన ఓ ద్విచక్ర వాహనం.. అదుపుతప్పి బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
![అధిగమించబోయి.. అనంతలోకాలకు accident at ramachandrapuram in sangareddy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5932949-239-5932949-1580647522014.jpg)
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం నందిగామకు చెందిన కుమార్, వెంకటేశ్‌లు ద్విచక్రవాహనంపై లింగంపల్లి నుంచి పటాన్‌చెరు వైపు వస్తున్నారు. వెంకటేశ్ వాహనం నడుపుతుండగా.. కుమార్ వెనక కూర్చున్నాడు. రామచంద్రపురంలోని సంగీత థియేటర్ వద్దకు రాగానే ముందుగా వెళ్తున్న నారాయణఖేడ్ డిపోకు చెందిన బస్సును అధిగమించబోయాడు. బండి అదుపు తప్పడం వల్ల బస్సును ఢీకొట్టాడు. ఘటనలో వెనక కూర్చున్న కుమార్ బస్సు కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. వెంకటేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న రామచంద్రపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:భార్యను చంపి జాతీయ గీతం పాడిన భర్త!
TAGGED:
అధిగమించబోయి.. అనంతలోకాలకు