తెలంగాణ

telangana

ETV Bharat / state

సంగారెడ్డి జిల్లాలో ఆకుకూరల పండుగ

వీటికి విత్తనాలను వేయరు, కలుపు మందులు వాడరు. వాటంతట అవే ఏటా పెరుగుతాయి. వీటికి సాగు చేయని ఆకుకూరలని పేరు. అరుదైన ఈ మొక్కలను గుర్తించి, పెంచి, వండుకుని తినడం ద్వారా పౌష్టికాహార లోపం లేకుండా జీవించవచ్చు. ఈ అరుదైన ఆకుకూరల గురించి రైతులకు, పట్టణ, నగర ప్రజలకు తెలియజేసేందుకు డెక్కన్‌ డెవలప్​మెంట్‌ సొసైటీ ఏటా ఆకుకూరల పండుగ నిర్వహిస్తున్నది.

సంగారెడ్డి జిల్లాలో ఆకుకూరల పండుగ

By

Published : Aug 18, 2019, 7:08 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో డెక్కన్ డెవలప్​మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆకుకూరల పండగ ఆద్యంతం ఆకట్టుకుంది. మాచనూర్ శివారులోని పచ్చసాలె ప్రాంగణంలో నిర్వహించిన ఆకుకూరల పండుగలో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర వినియోగదారులు పాల్గొన్నారు. చిరుధాన్యాల సాగులో భాగంగా పండే ఆకుకూరలతో వండిన కూరలను హాజరైన పర్యావరణ ప్రేమికులకు అందజేశారు. ఈ సందర్భంగా పంటల సాగు పొలాల్లో కలుపు తీత, చిరుధాన్యాల పంటల నమూనాలు, సహజసిద్ధంగా పండే 150 రకాల ఆకుకూరలను ప్రదర్శించారు. నిత్యం తీరిక లేకుండా గడిపే పట్టణవాసులు కుటుంబ సభ్యులతో పంట పొలాలకు తరలివచ్చి సేంద్రీయ వ్యవసాయం గురించి తెలుసుకున్నారు.

సంగారెడ్డి జిల్లాలో ఆకుకూరల పండుగ

ABOUT THE AUTHOR

...view details