లాక్డౌన్ను లెక్కచేయకుండా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ శివారులో కొంత మంది కల్లు దుకాణదారులు విక్రయాలు కొనసాగించారు. సమాచారం అందుకున్న ఆబ్కారీ, పోలీస్ అధికారులు సంయుక్తంగా కల్లు తయారీ స్థావరంపై దాడి చేశారు. అక్కడ తయారుచేసి నిల్వ ఉంచిన రెండు బ్యారెళ్ల కల్లును పారబోశారు. లాక్డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి కల్లు తయారు చేసి విక్రయిస్తున్న ఎనిమిది మంది నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఆబ్కారీ అధికారులు తెలిపారు.
లాక్డౌన్ ఎఫెక్ట్:అక్రమ కల్లు దుకాణాల నిర్వహణ.. ఆబ్కారీ దాడులు - ఆబ్కారీ దాడులు
ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించి.. కల్లు, మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేస్తే వాటిని బేఖాతరు చేస్తూ సంగారెడ్డి జిల్లాలోని కొంతమంది వ్యాపారులు విక్రయాలు కొనసాగించారు. దానితో సమాచారం అందుకున్న ఆబ్కారీ, పోలీస్ అధికారులు వాటిపై దాడి చేసి.. కేసు నమోదు చేశారు.
లాక్డౌన్ ఎఫెక్ట్:అక్రమ కల్లు దుకాణాల నిర్వహణ.. ఆబ్కారీ దాడులు