man tries to avoid vaccine: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 100 శాతం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు వెనకాడుతున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఎంత అవగాహన కల్పించినా.. కొందరిలో భయాలు, అపోహలు పోవడం లేదు. ఆరోగ్య కార్యకర్తలు చేస్తున్న అవగాహనను కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారాయి. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ వేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ వేయడానికి వెళ్లిన ఆరోగ్య కార్యకర్తలకు సంగారెడ్డి జిల్లాలో వింత అనుభవం ఎదురైంది.
man tries to avoid vaccine: 'వ్యాక్సిన్ వద్దు బాబోయ్..!'.. చెట్టెక్కి యువకుడు హల్‌చల్ - వ్యాక్సిన్ వద్దని చెట్టెక్కిన యువకుడు
man tries to avoid vaccine: కరోనా వ్యాక్సిన్ వేయడానికి వెళ్లిన ఆరోగ్య కార్యకర్తలకు సంగారెడ్డి జిల్లాలో వింత అనుభవం ఎదురైంది. న్యాల్‌కల్ మండలం రేజింతల్ గ్రామంలో గౌసోద్దీన్ అనే యువకుడు వ్యాక్సిన్ వద్దంటూ చెట్టు ఎక్కి హల్‌చల్ చేశాడు.
avoid vaccine
న్యాల్‌కల్ మండలం రేజింతల్ గ్రామంలో గౌసోద్దీన్ అనే యువకుడు వ్యాక్సిన్ వద్దంటూ చెట్టెక్కి హల్‌చల్ చేశాడు. సిబ్బంది తమ ఇంటికి రావడాన్ని గమనించిన గౌసోద్దీన్ వెంటనే చెట్టు ఎక్కి.. తనకు వ్యాక్సిన్ వద్దంటూ కేకలు పెట్టాడు. సుమారు గంటపాటు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. గౌసోద్దీన్ తండ్రి సర్దార్ అలీ మాత్రం టీకా వేసుకున్నారు.
ఇదీ చూడండి:vaccination in villages: "టీకా తీసుకోకుంటే రేషన్, కరెంట్ బంద్"