తెలంగాణ

telangana

ETV Bharat / state

హైపోక్లోరైట్​ ద్రావణం పిచికారీ చేయించిన యువకుడు - తెలంగాణ వార్తలు

ఊర్లో కరోనా కేసులు పెరుగుతుండడం.. మహమ్మారితో స్నేహితుడు సహా మరో ఇద్దరు వ్యక్తులు మరణించడం వల్ల కొవిడ్​ బారిన పడి మరెవ్వరూ చనిపోవద్దనుకున్నాడు ఓ యువకుడు. సంగారెడ్డి జిల్లా మన్నాపూర్ గ్రామంలో హైపోక్లోరైట్​ ద్రావణం పిచికారీ చేయించి పెద్ద మనసు చాటుకున్నాడు.

hypochlorite, Mannapur village, Sangareddy district
hypochlorite, Mannapur village, Sangareddy district

By

Published : May 16, 2021, 8:36 PM IST

సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మన్నాపూర్ గ్రామానికి చెందిన దశరథ్ అనే యువకుడు సొంత నిధులు వెచ్చించి గ్రామంతో పాటు శివారు కాలనీల్లో రసాయన ద్రావణం పిచికారీ చేయించాడు. మహమ్మారితో తన స్నేహితుడితో పాటు మరో ఇద్దరు మరణించారని.. కొవిడ్​ వల్ల మరెవ్వరూ చనిపోవద్దని ఈ నిర్ణయం తీసుకున్నట్లు దశరథ్​ తెలిపాడు. గ్రామస్థుల ఆరోగ్యం కోసం ముందస్తు చర్యల్లో భాగంగా హైపోక్లోరైట్​ ద్రావణం పిచికారీ చేయించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. దశరథ్ సేవాభావాన్ని అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details