సంగారెడ్డి జిల్లాలో వేప చెట్టు నుంచి తెల్లని ద్రవం కారడాన్ని ప్రజలు ఆశ్యర్యంగా చూస్తున్నారు. న్యాల్కల్ మండల కేంద్రంలో ఉన్న సుంకరి నాగన్న పొలంలో ఉన్న వేప చెట్టుకు నిరంతరాయంగా కల్లులా ఉన్న ద్రావణం కారుతోంది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు అక్కడి వెళ్లి వింతగా చూస్తున్నారు.
వేపచెట్టు నుంచి కారుతోన్న తెల్లని ద్రవం - Nyalkal news
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో ఓ వేపచెట్టు నుంచి తెల్లని ద్రవం కారుతోంది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు దృశ్యాన్ని వింతగా చూస్తున్నారు.
వేపచెట్టు నుంచి కారుతోన్న తెల్లని ద్రవం
కొంతమంది ఆ ద్రావణాన్ని పట్టుకొని తాగారు. మరికొందరు ఇది అమ్మవారి ప్రభావం అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యాన శాస్త్రవేత్తలు మాత్రం వైరస్ ప్రభావంతో ఇలా తెల్లటి ద్రవం కారుతుందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:రాష్ట్రానికి ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల వెల్లువ.. పెరిగిన ఉపాధి