ఐఐటీ హైదరాబాద్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కంప్యూటర్ సైన్స్ మూడో సంవత్సం చదువుతున్న సిద్ధార్థ... తెల్లవారుజామున వసతి గృహం పైనుంచి దూకాడు. తీవ్రగాయాలైన విద్యార్థిని ఆస్పత్రికి తరలిస్తుండగా... మృతిచెందాడు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లోని విద్యార్థి తల్లిదండ్రులకు క్యాంపస్ అధికారులు సమాచారం అందించారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సిద్దార్థ తమకు మెయిల్ చేసినట్లు అతని స్నేహితులు చెబుతున్నారు. తాను చదువులో వెనుకబడుతున్నానని, జీవితంలో రాణించలేనేమోనని అనుమానంగా ఉందని ఆ మెయిల్‌లో రాసినట్లు చెప్పారు. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.... ఆధారాలు సేకరిస్తున్నారు.
జీవితంలో రాణించలేనేమోనని ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య - crime news
ఐఐటీ హైదరాబాద్‌లో ఓ విద్యార్థి... వసతి గృహం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
A student suicide at IIT Hyderabad