తెలంగాణ

telangana

ETV Bharat / state

Road Accident at Rudraram : మద్యం తాగి డీసీఎం నడిపిన డ్రైవర్.. ఏమైందంటే.. - డీసీఎం లారీ రోడ్డు ప్రమాదం

Road Accident at Rudraram : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ సమీపంలో లారీని వెనుక నుంచి పెళ్లి బృందం వెళుతున్న డీసీఎం ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : May 13, 2023, 5:20 PM IST

Road Accident at Rudraram in Sangareddy : కుటుంబంలో కూతురు పెళ్లి అయింది. దీంతో పెళ్లి కొడుకు ఇంటి దగ్గర రిసెప్షన్​ ఏర్పాటు చేశారు. పెళ్లి కూతురు తరుఫు బంధువులు అందరూ వెళ్లి.. ఆనందంగా గడిపారు. తిరిగి వారి సొంత ఊరు వచ్చేందుకు డీసీఎం బుక్​ చేశారు. ఏర్పాట్లు బాగానే ఉన్నాయని అందరూ అనుకొన్నారు. సీన్​ కట్​ చేస్తే రోడ్ ప్రమాదం జరిగి ఇద్దరు మృతి చెందారు, మరో ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇదంతా ఎలా జరిగిందంటే వారు బుక్​ చేసుకున్న డీసీఎం నడిపిన వ్యక్తి ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో చూసుకోలేకపోయారు. ఆ డ్రైవర్​ తాగి వాహనం నడపడం వల్ల ఆ కుటుంబం, వారితో వచ్చిన వారంతా మూల్యం చెల్లించుకున్నారు. ఇందులో వధువరులు కూడా ఉన్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం చిట్కుల్​ గ్రామానికి చెందిన రామచంద్రయ్య కూతురు వివాహాం జరిగింది. దీంతో పెళ్లి కొడుకు ఊరు మంగళారంపేటలో రిసెప్షన్​ ఏర్పాటు చేశారు. పెళ్లి కూతురు తరుఫు బంధువులు సమారు 40 మంది ఆ రిసిప్షన్​కి వచ్చారు. రిసిప్షన్​ అయిన తరువాత వారు తిరిగి సొంత ఊరు వస్తున్న క్రమంలో.. పటాన్​చెరు మండలంలోని రుద్రారం గ్రామ శివారు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న డీసీఎం ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టింది.

ప్రమాదంలో పెళ్లి బృందంలోని రాములమ్మ, కిష్టమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారందరికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం జరిగిందని తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం తెలియజేశారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని.. గాయాలతో ఉన్న వారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి జరగడానికి కారణం వారు ప్రయాణించిన డీసీఎం డ్రైవర్​ మద్యం తాగి ఉన్నారని.. అందుకే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పెళ్లి కూతురి కాళ్లకు బలంగా దెబ్బతగిలిందని.. హైదరాబాద్​లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details