Online Fraud Took place in Gummadidala: రోజురోజుకు ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. టెక్నాలజీలో దేశం ఎంత పురోగతిలో ఎంత పుంజుకున్నా ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఆన్లైన్లో ఏర్పడిన పరిచయాలు.. వాటివల్ల కలిగే పర్యవసానాలతో ఉన్నదంతా కోల్పోవాల్సి వస్తోంది. ఆశ పడ్డామా అంతే.. మనకు తెలియకుంటే మన ఆస్తి హారతి కర్పూరమవుతుంది. అవతలి వారి తియ్యటిమాటలకు టెంప్ట్ అయ్యామంటే చాలు ఖాతా ఖాళీ అవుతుంది. అలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో చోటుచేసుకుంది. ఆన్లైన్లో ఏర్పడిన పరిచయం వల్ల ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏకంగా రూ.1.72 కోట్లను పొగోట్టున్నాడు. వివరాల్లోకెళ్తే
ఆయిల్ కంపెనీ కోసం పరిచయం:సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామానికి చెందిన నరహరికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. 2019 సెప్టెంబర్లో మధ్యవర్తి ద్వారా ఓ యువతితో పరిచయం ఏర్పడింది. తన పేరు జానీ విలియమ్స్. తాను యూకేకి చెందిన వ్యక్తిగా పరిచయం చేసుకుంది. తమకు ఫార్మసి కంపెనీ ఉందని మాయ మాటలు చెప్పి నరహరితో పరిచయం పెంచుకుంది. తన ఫార్మా కంపెనీకి జిన్ సాంగ్ లిక్విడ్ ఆయిల్ అవసరం ఉందని నరహరితో చెప్పింది. తమకు ఉత్పత్తి చేసే వారి వివరాలు ఇస్తానని... వాళ్లకి, తమకు మధ్య బయ్యర్గా ఉండాలని ముగ్గులోకి లాగింది.