సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అల్గోల్‌లో సుదర్శన్ దారుణహత్యకు గురయ్యాడు. పాతకక్షలతోనే అతన్ని హత్య చేసినట్లు పోలీసలు అనుమానిస్తున్నారు. పదేళ్ల క్రితం సుదర్శన్ అదే గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డిని హత్య చేశాడు. అప్పటి నుంచి ప్రతీకారంతో ఉన్న వెంకట్‌రెడ్డి కుటుంబీకులు పొలం వద్ద సుదర్శన్‌తో గొడవపడ్డారు. కర్రలతో దాడి చేసి సుదర్శన్‌ను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలిని జహీరాబాద్ డీఎస్పీ గణపత్ జాదవ్, సీఐ సైదేశ్వర్ పరిశీలించారు.
అల్గోల్‌లో వ్యక్తి దారుణ హత్య - latest crime in sangareddy district
పాతకక్షలతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా అల్గోల్‌లో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
సుదర్శన్