తెలంగాణ

telangana

ETV Bharat / state

శానిటైజర్ తయారు చేసిన విద్యార్థిని - ఐఐటీ విద్యార్థిని

కరోనా నివారణ చర్యల్లో భాగంగా శానిటైజర్​ వాడకం పెరిగింది. దీనితో మార్కెట్లో వీటి కొరత ఏర్పడి.. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీన్ని గమనించిన హైదరాబాద్​లోని ఓ ఐఐటీ విద్యార్థిని తమ ల్యాబ్​లోనే శానిటైజర్​ను తయారు చేసి విద్యార్థులకు పంపిణీ చేస్తోంది.

A Hyderabad IIT student who made sanitizer at ramachandrapuram sangareddy
శానిటైజర్ తయారు చేసిన విద్యార్థిని

By

Published : Mar 19, 2020, 2:53 PM IST

కరోనా నేపథ్యంలో శానిటైజర్ల వినియోగం పెరగడం వల్ల మార్కెట్లో వాటి కొరత ఏర్పడింది. ఈ క్రమంలో ఐఐటీ హైదరాబాద్‌ తమ అవసరాల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా ఐఐటీ విద్యార్థిని శివకల్యాణి శానిటైజర్ తయారు చేసింది.

ఐఐటీ ప్రాంగణంలో సుమారు 2500 మంది విద్యార్థులు ఉండగా వారి కోసం ప్రధాన ప్రాంతాల్లో శానిటైజర్‌ సీసాలను అందుబాటులో ఉంచారు. ఒక్కొక్కరికి 100 మిల్లీ లీటర్ల చొప్పున చిన్న డబ్బాలనూ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

తాను తయారు చేసిన శానిటైజర్​లో 70 శాతం ఐసోప్రొపనాల్‌, గ్లిసరాల్‌, పాలీప్రొపిలీన్‌ గ్లైకాల్‌, సువాసన కోసం నిమ్మగడ్డి నూనెని ఉపయోగించానని ఆమె తెలిపారు. ఇది ప్రభావమంతంగా పనిచేస్తుందని శివకల్యాణి తెలిపారు.

శానిటైజర్ తయారు చేసిన విద్యార్థిని

ఇదీ చూడండి:కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఏం చేయాలంటే..

ABOUT THE AUTHOR

...view details