సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మ్యాక్స్ సొసైటీ రహదారిని ఆనుకుని ఉన్న ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ యువకుడిని కాల్చేందుకు యత్నించడం వల్ల సగం కాలిన మృతదేహం బయటపడింది. ఫలితంగా చుట్టుపక్కల కాలనీవాసులు ఉలిక్కిపడ్డారు.
అనుమానాస్పద స్థితిలో సగం కాలిన మృతదేహం - latest crime news in sangareddy district
రామచంద్రపురం మ్యాక్స్ సొసైటీ రహదారి పక్కన సగం కాలిన ఓ యువకుడి మృతదేహం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అనుమానాస్పద స్థితిలో సగం కాలిన మృతదేహం
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతుడు బొంబాయి కాలనీకి చెందిన లతీఫ్గా గుర్తించారు. ఆధారాలు సేకరించేందుకు వచ్చిన పోలీసు జాగిలం మ్యాక్స్ సొసైటీ పరిసర ప్రాంతాల్లో గల ఓ భవనం దాకా వెళ్లి ఆగిపోయింది. ఫలితంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇవీ చూడండి : పురపోరులో తెరాసకు ఇంటిపోరు