తెలంగాణ

telangana

ETV Bharat / state

సొరియాసిస్ తగ్గట్లేదని బలవన్మరణానికి పాల్పడ్డ బాలిక - సంగారెడ్డి జిల్లా

పదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఓ బాలిక తీవ్ర మనోవేదనకు గురైంది. తనకు ఇక వ్యాధి తగ్గదేమో అనే భయాందోళనతో బలవన్మరణానికి పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​ చెరు మండలం కర్థనూర్ శివారులో చోటు చేసుకుంది.

సొరియాసిస్ తగ్గట్లేదని బలవన్మరణానికి పాల్పడ్డ బాలిక
సొరియాసిస్ తగ్గట్లేదని బలవన్మరణానికి పాల్పడ్డ బాలిక

By

Published : Jul 2, 2020, 11:06 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండల పరిధిలో ఓ బాలిక సొరియాసిస్ సమస్యతో ఆత్మహత్యకు పాల్పడింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీను కుటుంబంతో సహా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం కర్థనూరు శివారు ఘనపూర్ గ్రామానికి వెళ్లే కూడలి సమీపంలో నివాసం ఉంటున్నారు. శ్రీనుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత పదేళ్లుగా శ్రీను కుమార్తె భార్గవి సొరియాసిస్ వ్యాధితో బాధపడుతోంది. ఆసుపత్రుల చుట్టూ తిరిగినా తగ్గకపోవడం వల్ల తీవ్ర మనోవేదనకు లోనైంది. పడక గదిలోని పైపునకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. బీడీఎల్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పటాన్​ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details