సంగారెడ్డి జిల్లా మల్లేపల్లికి చెందిన వెంకటేశ్ తొమ్మిదేళ్ల క్రితం వరకు ఎంతో సంతోషంగా ఉండే వాడు. ఆటో నడుపుకుంటూ ఆత్మగౌరవంగా బతికేవాడు. అంత వరకు ఆనందంగా ఉన్న ఆ కుటుంబంలో ఊహించని ప్రమాదం తీవ్ర విషాదం మిగిల్చింది. పొలంలో పనిచేయడానికి వెళ్లిన వెంకటేశ్ విద్యుదాఘాతంతో దివ్యాంగుడిగా మిగిలాడు. తగిలిన గాయాలు ఆరు నెలలకు మానాయి. కానీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పూట గడవడం కష్టంగా మారి కుటుంబ పోషణ కోసం భిక్షటన చేస్తున్నాడు. తనకు మరో మార్గం లేకే ఈ వృత్తిని ఎంచుకున్నాని నిస్సాహయత వ్యక్తం చేస్తున్నాడు.
దాతలు దయ తలిస్తే..
పొలంలో పనిచేస్తుండగా విద్యుదాఘాతం అయింది. ప్రమాదంలో చెయ్యి, కాలు పోయించి. అప్పటి వరకు ఆటో నడుపుకుని కుటుంబాన్ని పోషించుకునే వాడిని. అంతకు ముందు వరకు గౌరవంగా బతికిన నేను.. నిస్సాహాయ స్థితిలో భిక్షమెత్తుకుని బతుకుతున్నాను. ఎవరైనా దాతలు సాయం చేస్తే ఏదైనా వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటాను. -వెంకటేశ్, బాధితుడు.
పనికెళ్తేనే పూట గడుస్తుంది