తెలంగాణ

telangana

ETV Bharat / state

అమ్మ ఒడిలో ఆడుకోవాల్సిన పసికందు.. ముళ్లపొదల్లో..! - Child case in Jahirabad

A baby was abandoned in Sangareddy district: బిడ్డ పుట్టిందంటే చాలా మంది తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు. దీనికి భిన్నంగా అప్పుడే పుట్టి అమ్మ పొత్తిళ్లలో హాయిగా నిద్రించాల్సిన చిన్నారిని కసాయి వ్యక్తులు మానవత్వం మరిచి ముళ్ళపొదలో పారేశారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. స్థానికులు పసిపాప ఏడుపు విని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

The baby was thrown into the thorn bushes
పసికందుని ముళ్లపొదల్లో పడేశారు

By

Published : Dec 26, 2022, 4:22 PM IST

A baby was abandoned in Sangareddy district: ఆడపిల్ల పుట్టిందంటే చాలు చాలా మంది బరువు అనుకొంటారు. ఆ పిల్లని పెంచి, పోషించి... ఇంకొకరితో పెళ్లి చేసి పంపించడం ఇదంతా బాధ్యతగా కాకుండా బరువుగా అనుకొంటారు. దీంతో కొంత మంది ఆడపిల్ల పుట్టగానే తమకు అక్కర్లలేదనుకొంటారు. ఇలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బూచినెల్లిలో చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు మానవత్వం లేకుండా ముళ్ళపొదల్లో పడేశారు. పసికందు ఏడుపులు విన్న స్థానికులు చిరాగ్ పల్లి పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ కాశీనాథ్ పోలీసు వాహనంలోనే జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి శిశువును తరలించారు. శిశువు తక్కువ బరువుతో పుట్టడం వలన పరీక్షలు నిర్వహించిన వైద్యులు పసికందును సంగారెడ్డిలోని జిల్లా ఆసుపత్రికి తరలించారని సూచించారు. ఐసీడీఎస్ సిబ్బంది సహకారంతో ఆడ శిశువును జిల్లా ఆసుపత్రిలోని మాతా శిశు కేంద్రానికి తరలించారు. పసికందును పారవేసిన ఘటనపై అంగన్​ వాడీ, ఆశా కార్యకర్తలతో దర్యాప్తు చేసి బాధ్యులను గుర్తిస్తామని చిరాగ్​పల్లి పోలీసులు తెలిపారు.

"ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పసిపిల్లని పొదల్లో పడేశారని స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలిని చేరుకున్నాము. అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించాము. చంద్రకళ అంగన్​వాడీ టీచర్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాము. తదుపరి దర్యాప్తు చేపడతాము." - ఎమ్​. కాశీనాథ్, స్థానిక ఎస్​ఐ

పసికందుని ముళ్లపొదల్లో పడేశారు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details