15 month child died suspiciously in Sangareddy: కుటుంబంలో కలహాలు వల్ల కొన్నిసార్లు దారుణాలు జరుగుతాయి. చిన్నపాపను కొట్టడానికే మనస్సు ఒప్పుకోదు. అలాంటిది కుటుంబంలో గొడవల కారణంగా ఓ పసి ప్రాణం పోయింది. భార్యాభర్తల గొడవలో 15 నెలల పాప అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పాప తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లాలోని మాచిరెడ్డిపల్లిలో భాగ్యలక్ష్మీ తన భర్త, అత్త ఇద్దరు రోజూ వేధిస్తున్నారని బాధపడేది. ఈరోజు భర్తను డబ్బులు అడిగిందని కొట్టాడు. దీంతో భర్త, అత్తల వేధింపులపై సర్పంచికి ఫిర్యాదు చేసేందుకు ఆమె వెళ్లింది. తన బాధ చెప్పుకుని వచ్చేలోపు 15 నెలల పాప వైష్ణవి చనిపోయింది.
ఈ విషయం పట్ల తల్లి అనుమానం వ్యక్తం చేస్తోంది. కులాంతర వివాహం చేసుకున్నామని కోపంతో తరుచుగా వేధింపులకు పాల్పడుతుందని.. ఆమె అత్త తన కుమార్తెను హత్య చేసిందని ఆరోపించింది. గతంలోనూ ఇలానే ఏడు నెలల పాప అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని రోదిస్తూ తెలిపింది. భర్త వెంకటరెడ్డి, అత్త వనజాత పథకం ప్రకారం పాపను చంపేశారని తల్లి భాగ్యలక్ష్మి కోహీర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.