సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక గురుకుల పాఠశాల విద్యార్థులు 71 మీటర్లు పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించారు. పట్టణంలో ప్రధాన రహదారుల ద్వార ప్రభాత భేరి నిర్వహించారు.
నారాయణఖేడ్‌లో 71 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ - నారాయణఖేడ్‌లో 71 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో 71వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్థానిక గురుకుల పాఠశాల విద్యార్థులు 71 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు.
నారాయణఖేడ్‌లో 71 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ
పట్టణంలో వివిధ పాఠశాలల విద్యార్థులు జాతీయోద్యమ నాయకుల వేశధారణలో అలరించారు. స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్, జడ్జి జస్టిస్ శ్రీదేవి, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, తదితరులు ఆయా కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు.
ఇదీ చూడండి: మహా చారిత్రక పత్రం.. మన రాజ్యాంగం