సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిపో వద్దకు చేరుకున్న 70 మంది ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మహిళా కార్మికులను సముదాయించి వెనక్కి పంపేందుకు ప్రయత్నించినా వారు వినకపోవడం వల్ల అందరినీ అదుపులోకి తీసుకున్నారు. తాము ఆందోళన చేసేందుకు రాలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. విధుల్లో చేరేందుకు వస్తే అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసమని పోలీసులతో కార్మికులు వాగ్వాదానికి దిగారు.
జహీరాబాద్లో 70 మంది కార్మికుల అరెస్ట్ - జహీరాబాద్లో 70 మంది కార్మికుల అరెస్ట్
విధుల్లో చేరేందుకు జహీరాబాద్ డిపో వద్దకు వస్తున్న కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు.
జహీరాబాద్లో 70 మంది కార్మికుల అరెస్ట్