సంగారెడ్డి జిల్లా కంగ్టి మీదుగా అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. కంగ్టి ఎస్ఐ అబ్దుల్ రఫిక్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలో భాగంగా కర్ణాటక నుంచి వస్తున్న ఓ వ్యాన్‌ను సోదా చేశారు.
అక్రమంగా తరలిస్తున్న 54 సంచుల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం - సంగారెడ్డి జిల్లా వార్తలు
అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కా ప్యాకెట్లను సంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 54 సంచుల్లో ఉన్న గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న 54 సంచుల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
ఆ వాహనంలో 54 సంచుల్లో గుట్కా ప్యాకెట్లు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు నిజామాబాద్‌కు చెందిన నజీర్‌గా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి :దొంగ ఓట్లు వేస్తున్నారని ఆందోళన