గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ అధికారులు ఐదు గేట్లు ఎత్తివేశారు. ఎగువ ప్రాంతం నుంచి 68,059 క్యూసెక్కుల వరదనీరు రాగా గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఏఈ పేర్కొన్నారు.
సింగూరులో ఐదు గేట్లు ఎత్తివేసి 68 వేల క్యూసెక్కుల నీరు విడుదల - సంగారెడ్డి జిల్లా వార్తలు
వర్ష బీభత్సానికి సంగారెడ్డి జిల్లా సింగూరులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండగా జలాశయంలోకి పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరింది. ప్రాజెక్టులోకి 68,059 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా ఐదు గేట్లు ఎత్తి 68,089 క్యూసెక్కుల నీటిని దిగువ భాగానికి అధికారులు వదిలారు.
![సింగూరులో ఐదు గేట్లు ఎత్తివేసి 68 వేల క్యూసెక్కుల నీరు విడుదల singuru reservoir latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9174491-483-9174491-1602682892853.jpg)
సింగూరులో ఐదు గేట్లు ఎత్తివేసి 68 వేల క్యూసెక్కుల నీరు విడుదల
నాలుగు నెలల క్రితం 0.689 టీఎంసీల నీరుండగా అడపాదడపా వర్షాలు కురుస్తుండగా జలాశయంలోకి 24.5 టీఎంసీల నీరు చేరింది. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి ఒక్కరోజులోనే 5 టీఎంసీల నీరు చేరగా... వాటితో పాటు 45 ఏళ్ల పాటు జిల్లా వాసులకు సాగునీటి ఇబ్బందులు ఉండవని రైతులు సంబరపడుతున్నారు.
ఇదీ చదవండి:'రాష్ట్రంలో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలే లేవు'