సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. సదాశివపేట పురపాలక సంఘంలో 26 వార్డులకు గానూ... ఒక వార్డు ఏకగ్రీవం కాగా... మిగిలిన 25 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 25వ వార్డులో 100 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
సదాశివపేటలో 11 గంటల వరకు 43 శాతం పోలింగ్ - Municipal Elections polling
సదాశివపేటలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 11 గంటల వరకు 43 శాతం పోలింగ్ నమోదైంది.

సదాశివపేటలో 11 గంటల వరకు 43 శాతం పోలింగ్
ఎన్నికల కోసం పట్టణంలోని 52 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా... 336 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. 11 గంటల వరకు 43 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
సదాశివపేటలో 11 గంటల వరకు 43 శాతం పోలింగ్
- ఇవీ చూడండి: హలో ఓటర్.. ఓటేస్తూ సెల్ఫీలు వద్దు!