రాష్ట్రంలో కరోనా బుసలు కొడుతోంది. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని రాజారాం తండాకు చెందిన 38 మందికి పాజిటివ్ అని తేలింది. 68 పరీక్షలు నిర్వహించగా 39 మందికి వైరస్ నిర్ధరణ అయిందని మండల వైద్యాధికారి మనోహర్‌రెడ్డి తెలిపారు.
కంగ్టి మండలంలో ఆయా గ్రామాలకు చెందిన 163 మందికి పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. తండాకు చెందిన 68మందికి పరీక్షలు చేయగా 39 మంది మహమ్మారి బారిన పడ్డారని తేలిందన్నారు. అందులో 38 మంది ఒకే తండాకు చెందిన వారు కావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. మరొకరు చౌకన్పల్లి నివాసి.