రాష్ట్రంలో 2 లక్షల 30 వేల రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్లో లక్ష, మిగతా ప్రాంతాల్లో లక్ష 30 వేల ఇళ్లు నిర్మిస్తున్నట్లు... ఇప్పటి వరకు 30 వేల రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు అందించినట్లు తెలిపారు. నాణ్యతలో ఏ మాత్రం రాజీపడకుండా నిర్మిస్తున్నామన్నారు. ఇళ్లు లేని పేదవారందరికి ఇళ్లను అందించే వరకు ఈ పథకం కొనసాగుతుందంటున్న రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి....
30 వేల ఇళ్లు అందించాం: ప్రశాంత్ రెడ్డి
రాష్ట్రంలో 30 వేల రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు అందించామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.
ప్రశాంత్ రెడ్డి