తెలంగాణ

telangana

సంగారెడ్డి ముత్తంగిలో 30రోజుల కార్యాచరణపై అవగాహన ర్యాలీ

By

Published : Sep 14, 2019, 6:35 PM IST

రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్యం, మొక్కల పరిరక్షణకు గ్రామస్థులు, విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని గ్రామ సర్పంచ్‌ ఉపేందర్ అన్నారు.

గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రజల అడుగులు..

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామంలో సర్పంచ్ ఉపేందర్ ఆధ్వర్యంలో గ్రామస్థులు, విద్యార్థులతో కలిసి 30 రోజుల ప్రణాళికపై అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని వాటిని పరిరక్షించే బాధ్యత తీసుకోవాలని సర్పంచ్ అన్నారు. విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి ప్రణాళిక కోసం నియమించిన అధికారులు పాల్గొన్నారు.

గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రజల అడుగులు..

ABOUT THE AUTHOR

...view details