తెలంగాణ

telangana

ETV Bharat / state

3 రోజుల శిశువు మృతి... వైద్యుల నిర్లక్ష్యమేనని బంధువుల ఆరోపణ

సంగారెడ్డి జిల్లా కందిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో 3 రోజుల శిశువు మృతిచెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మరణించాడని శిశువు తండ్రి, బంధువులు ఆరోపించారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్​లో బాధితులు ఫిర్యాదు చేశామన్నారు.

By

Published : Sep 4, 2020, 4:45 PM IST

3 days baby died in sangareddy hospital
3 days baby died in sangareddy hospital

సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని బాలాజీ ఆస్పత్రిలో 3 రోజుల శిశువు మృతి చెందాడు. వికారాబాద్ జిల్లా అనంతగిరిపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్, చందన దంపతులు కొన్నేళ్లుగా.. సంగారెడ్డిలోని మంజీరనగర్ కాలనీలో నివాసముంటున్నారు. తన భార్య మొదటి కాన్పు కోసం బాలాజీ ఆస్పత్రికి తీసుకెళ్లగా మగ శిశువు జన్మించాడు.

గురువారం రోజు పిల్లాడు అస్వస్థతకు గురవగా... వైద్యులకు చెప్పినా స్పందించలేదని బంధువులు ఆరోపించారు. ఈ రోజు ఉదయం చూసేసరికి.. శిశువు మృతి చెందాడని ఆసుపత్రి వైద్యులు తెలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ శిశువు మరణానికి కారణం ఆసుపత్రి వైద్యులేనని... వారిపై అధికారులు చర్య తీసుకోవాలని బాధితులు డిమాండ్​ చేశారు.

ఇవీ చూడండి:యువకుడిపై యాసిడ్‌తో దాడిచేసిన యువతి

ABOUT THE AUTHOR

...view details