సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని ఆరు మండలాల్లో రెండో విడత ప్రాదేశిక ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. నారాయణఖేడ్, మనుర్, కల్హేర్, సిర్గాపూర్, కంగ్టి, నాగల్గిద్ద మండలాల్లోని ఆయా గ్రామాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 9 జడ్పీటీసీలు, 100 ఎంపీటీసీలకు గాను 564 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభ సమయం నుంచి ఓటర్లు కేంద్రాల వద్ద బారులు తీరారు.
నారాయణఖేడ్‌లో ప్రశాంతంగా పోలింగ్ - MPTC
అసలే ఎండాకాలం... ఆపై ఎన్నికలు... కాస్త ఆలస్యంగా వెళ్లినా ఎండలో వేచి చూడాల్సిందే. అందుకే ముందుగా వెళ్లి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు సంగారెడ్డి జిల్లావాసులు.
ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియ