Corona cases in schools: గురుకుల పాఠశాలలో కరోనా కలకలం.. 29 మందికి పాజిటివ్ - corona cases in sangareddy

17:05 December 02
గురుకుల పాఠశాలలో కరోనా కలకలం.. 29 మందికి పాజిటివ్
Corona cases in schools: సంగారెడ్డి జిల్లాలో జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో మరోసారి కరోనా కలకలం రేగింది. పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గురుకులంలో 29 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మొత్తం 284 మంది విద్యార్థినులను కొవిడ్ టెస్ట్‌లు చేయగా.. 29 మందికి వైరస్ సోకినట్లు తేలింది.
నాలుగు రోజుల క్రితం ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. ఆదివారం (నవంబర్ 28) 42 మంది విద్యార్థులు, ఉపాధ్యాయురాలికి వైరస్ నిర్ధారణ అయింది. అప్రమత్తమైన అధికారులు సోమవారం (నవంబర్ 29) మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 48కి చేరింది. వీరిలో 47 మంది విద్యార్థులు ఒక ఉపాధ్యాయురాలు ఉన్నారు.
ఇదీచూడండి:Corona Cases in gurukul school: గురుకుల పాఠశాలలో కరోనా కలకలం.. 48మందికి పాజిటివ్