సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం వల్ల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్ఎస్ఎల్, ఐటీడబ్ల్యూ కాలనీల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. అలాగే బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లించారు. పాజిటివ్ వచ్చిన వారితో సన్నిహితంగా మెలిగిన వారెవరైనా ఉన్నారా అని తెలుసుకుంటున్నారు.
అమీన్పూర్లో రెండు కరోనా కేసులు నమోదు - సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో రెండు కరోనా కేసులు నమోదు
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విషయం తెలుసుకున్న అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కాలనీలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.
అమీన్పూర్లో రెండు కరోనా కేసులు నమోదు
స్థానిక ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు కాలనీలో పరిస్థితిని సమీక్షిస్తున్నట్లుఅమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ సుజాత తెలిపారు. స్థానిక ప్రజలెవరూ అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకూడదని... వచ్చినా మాస్కులు, భౌతిక దూరం పాటించాలని సూచించారు.
ఇవీ చూడండి:అకాల వర్షాలతో రైతన్న కష్టం నేలపాలు!