తెలంగాణ

telangana

ETV Bharat / state

జహీరాబాద్​లో 150 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత - సంగారెడ్డి జిల్లా వార్తలు

సంగారెడ్డి జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన 150 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. దుండగులు పరారైనట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు.

150 quintals illegal ration rice caught at zahirabad in sangareddy district
జహీరాబాద్​లో 150 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

By

Published : Jul 10, 2020, 6:28 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. జహీరాబాద్ పట్టణంలోని హైటెక్ కాలనీలో రేకుల షెడులో నిల్వ చేసిన సుమారు మూడు లక్షల విలువైన 150 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

చౌక దుకాణాలు, లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు తరలించేందుకు నిల్వ చేసినట్లు తహసీల్దార్ నాగేశ్వర్రావు తెలిపారు. పట్టుబడిన బియ్యాన్ని పట్టణంలోని పౌర సరఫరాల గిడ్డంగికి తరలించారు. రెవెన్యూ అధికారుల రాకతో బియ్యం నిల్వ చేసిన దుండగులు పరారైనట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండీ :మద్యం అక్రమ రవాణాలో ఎస్‌ఈబీ సీఐ, ఎస్సై.. 557 సీసాలు స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details