సంగారెడ్డి జిల్లా బండ్లగూడలోని భార్గవ పరిశ్రమలో భారీ చోరీ జరిగింది. ఆ పరిశ్రమలో పని చేస్తున్న ప్రశాంత్ కుమార్ జైన్, రాజ్ బిహారి బెహ్రాతో కలిసి పరిశ్రమలో లాకర్‌ను పగులగొట్టారు. అందులో ఉన్న 12.50 లక్షలు దొంగలించారు. అనంతరం ఓ నాటకం ఆడారు. ఎవరో ఆగంతుకులు వచ్చి తమను కొట్టి డబ్బలు దోచుకెళ్లారని యాజమానికి చెప్పారు. యాజమాని అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పనిచేస్తున్న పరిశ్రమలోనే 12 లక్షలు దోచుకెళ్లారు
పనులు చేస్తారని ఇద్దరిని పరిశ్రమలో పెట్టుకున్నారు. యజమాని నమ్మి అక్కడే ఆశ్రయం కూడా కల్పించాడు.. కానీ ఆ నమ్మకం నట్టేట ముంచింది. పనిచేస్తున్న పరిశ్రమకే కన్నం వేశారు. రూ. 12.50 లక్షలు దోచుకెళ్లారు. చివరికి దొరికిపోయారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా బండ్లగూడలో చోటుచేసుకుంది.
పోలీసులు అనుమానంతో తమదైన శైలిలో రాజ్ బిహారిని విచారించగా నిజం వెల్లడించాడు. ప్రశాంత్ కుమార్ ఒడిశాకు నగదును తీసుకుని పారిపోతుండగా ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల వద్ద పోలీసులు పట్టుకున్నారు. మరికొంత నగదును.. తమకు సహకరించిన రాజ్ బిహారిబెహ్రాకు ఇచ్చినట్లు సమాచారం. అతని వద్ద నుంచి 9. 50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఈ కేసును 24 గంటల్లోనే ఛేదించారు. ఇరువురిని రామచంద్రపురం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు సిబ్బందిని డీసీపీ వెంకటేశ్వరరావు అభినందించారు.
ఇదీ చూడండి : 'అబ్బాయిలను ట్రాప్ చేస్తే... అమ్మాయిలపై కేసులు పెట్టరా?'