సంగారెడ్డి జిల్లా మనూరు మండలం తిమ్మాపూర్ శివారులోని పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. పోలీసులకు అందిన రహస్య సమాచారం మేరకు గ్రామ శివారులోని ఒక చెట్టు కింద పేకాట ఆడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 15 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
11 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్ - సంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ శివారులో పేకాట స్థావరంపై దాడి
సంగారెడ్డి జిల్లాలోని తిమ్మాపూర్ శివారులో పేకాట స్థావరంపై దాడి చేసిన పోలీసులు 11 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 15 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
11 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్
జూదరులను కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ నరేందర్ తెలిపారు. కరోనా లాక్డౌన్ అమలుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. తాము రాత్రి పగలు విధులు నిర్వహిస్తూ నిద్రలు లేకుండా పోరాడుతున్న తరుణంలో గ్రామాల్లో ఎక్కడ పేకాట ఆటను ప్రోత్సహించకూడదని సూచించారు.
ఇవీ చూడండి:సాదాసీదాగా తెజస వార్షికోత్సవం