సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హుగ్గెల్లిలోో విషాదం చోటుచేసుకుంది. ప్రవీణ్ కుమార్ అనే విద్యార్థి తన అన్నతో కలిసి ద్విచక్రవాహనంపై మాచిరెడ్డిపల్లి వైపు వెళ్తుండగా వెనక నుంచి డీసీఎం ఢీకొట్టింది.
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి - road Accident latest news
ద్విచక్ర వాహనాన్ని డీసీఎం వ్యాన్ వెనక నుంచి ఢీకొన్న ఘటనలో పదో తరగతి విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. కళాశాలలో చేరేందుకు ఎదురు చూస్తున్న బిడ్డ మృతి తల్లిదండ్రులను, కుటుంబసభ్యులకు తీరని శోకాన్నిమిగిల్చింది.
రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి మృతి
ఈ ప్రమాదంలో ప్రవీణ్ కుమార్ తలమీదుగా డీసీఎం వెళ్లటం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు జహీరాబాద్ గ్రామీణ ఎస్సై వినయ్ కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.