ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం మరో 100 మంది ఈ వైరస్ బారినపడగా.. ఇద్దరు మృతి చెందినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఇందులో సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 72 కేసులు వెలుగుచూడగా.. ఇద్దరు చనిపోయారు. సిద్దిపేట జిల్లాలో 19 మంది వైరస్ బారినపడగా.. మెదక్ జిల్లాలో 9 మంది కరోనా కోరల్లో చిక్కుకున్నారు.
ఫలితంగా అప్రమత్తమైన అధికారులు కేసులు నమోదైన ప్రాంతాలను రసాయన ద్రావణాలతో పిచికారీ చేయిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమయితే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు.