అక్రమంగా తరలిస్తున్న వంద కిలోల ఎండు గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం కడపల్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా గంజాయి దొరికిందని నారాయణఖేడ్ సీఐ రవీందర్ రెడ్డి తెలిపారు.
కడపల్లో 100కిలోల ఎండు గంజాయి పట్టివేత - సంగారెడ్డి జిల్లా తాజావార్తలు
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం కడపల్లో అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల ఎండు గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు.
![కడపల్లో 100కిలోల ఎండు గంజాయి పట్టివేత కడపల్లో 100కిలోల ఎండు గంజాయి పట్టివేత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8397586-243-8397586-1597256719442.jpg)
కడపల్లో 100కిలోల ఎండు గంజాయి పట్టివేత
గంజాయి తరలిస్తున్న కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్కు చెందిన అశోక్, సునీత గంజాయిని అదుపులోకి తీసుకున్నారు. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట నుంచి గౌడగామ్ వరకు కారులో గంజాయిని తరలించేందుకు స్మగ్లర్లతో ఒప్పందం చేసుకున్నట్లు గుర్తించారు.
ఇదీ చదవండి:ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహిస్తే రైతులకు మేలు : కేటీఆర్