వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పేరిట నిర్వహిస్తున్న పాదయాత్ర ఆరో రోజుకు చేరింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామం నుంచి తుమ్మలూరు గేట్, రాచూలూరు గేట్, బైరాగిగూడ గేట్, లేమూర్ గేట్, లేమూర్, ఆగర్ మియాగూడలలో షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది.
6th Day Sharmila Padayatra: ప్రభుత్వ కొలువులొచ్చాయా.. పింఛన్లు అందుతున్నాయా? - ys sharmila news
వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆరోరోజు కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను షర్మిల పరిశీలించారు. మధ్యాహ్నభోజనం, మరుగుదొడ్లపై ఆరా తీశారు. విద్యార్థులతో మాట్లాడారు.
తుమ్మలూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను షర్మిల పరిశీలించారు. టాయిలెట్స్, మధ్యాహ్న భోజనంపై విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనం బాగుంటుందా..? బోధన అర్థం అవుతుందా..? అంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్లు వద్ద దుర్వాసన వస్తోందంటూ అసహనం వ్యక్తం చేశారు. అలాగే దారిపొడవునా మహిళలను పలకరిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయా.. ఆసరా పింఛన్లు అందుతున్నాయా.. అంటూ మహిళలను ప్రశ్నించారు. పాదయాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా లేమూర్, ఆగర్ మియాగూడ గ్రామానికి చేరుకున్నాక.. షర్మిల అక్కడే రాత్రి బసచేస్తారు.