ఆషాడ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా భాగ్యనగరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పలు అమ్మవారి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. మహిళలు బోనాలను ఎత్తుకుని అమ్మవార్లకు సమర్పించారు. పలు ప్రాంతాల్లోని అమ్మవార్ల అలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి బోనాలు సమర్పిస్తున్నారు.
ఆషాడ మాస బోనాల్లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని పెద్ద మంగళవారం గ్రామంలోని అమ్మవారికి షర్మిల బోనం సమర్మించారు. తన చిన్ననాటి స్నేహితురాలు రజిని నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో కలిసి వై.ఎస్.షర్మిల బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. బోనం ఎత్తుకుని స్నేహితురాలి కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు.