తెలంగాణ

telangana

ETV Bharat / state

Young Woman Raped At bus Stand : అమానుషం.. బస్టాండ్​లో నిద్రపోతున్న యువతిపై అత్యాచారం - చేవెళ్ల తాజా వార్తలు

Young Woman Raped At bus Stand Chevella : మహిళలు, చిన్నారులపై కామాంధుల ఆగడాలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒకచోట లైంగిక దాడులు, అత్యాచారాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా బస్టాండ్‌లో నిద్రపోతున్న యువతిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

Woman Raped by Two Men in chevella
Woman Raped At Chevella bus Stand

By ETV Bharat Telangana Team

Published : Oct 17, 2023, 12:30 PM IST

Young Woman Raped At bus Stand Chevella : ప్రస్తుత కాలంలో ఆడవారు అర్ధరాత్రే కాదు.. పట్టపగలూ ఒంటరిగా బయటకు రావాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. మహిళల సంరక్షణ కోసం ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. నిందితులను కఠినంగా శిక్షించినా.. మహిళలపై కీచకుల అఘాయిత్యాలు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మరో దారుణ ఘటన వెలుగు చూసింది. బస్టాండ్‌లో నిద్రపోతున్న యువతిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Old Man Suicide After Raped Girl : ఐదేళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారం.. ఆపై ఉరివేసుకుని ఆత్మహత్య

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కేశంపేట మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన యువతి(20)కి నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన వారం రోజులకే భర్తతో విభేదాలు రావడంతో పుట్టింట్లోనే ఉంటోంది. ఆ యువతి ఆదివారం రోజున తల్లిదండ్రులతో గొడవ పడి చేవెళ్లలోని సోదరి ఇంటికి బయల్దేరింది. అక్క ఇంటివద్ద లేకపోవడంతో ఆమె తిరిగి ఇంటికి వెళ్లలేక.. మద్యం సేవించి చేవెళ్ల బస్టాండ్‌కు వచ్చింది. ఊరికి వెళ్లడానికి బస్సులు లేకపోవడంతో అప్పటికే మత్తులో ఉన్న ఆమె బస్టాండ్‌లోనే నిద్రపోయింది.

థాయ్ విద్యార్థినిపై హెచ్‌సీయూ ప్రొఫెసర్ అత్యాచారయత్నం.. భగ్గుమన్న విద్యార్థులు

Young Woman Rape at Chevella Bus Stand : ఇదే అదునుగా భావించిన ఇద్దరు యువకులు.. ఒంటరిగా ఉండడం చూసి యువతిపై కన్నేశారు. రాత్రి 10 గంటల తర్వాత ప్రజలు ఎవరూ అక్కడ లేకపోవడాన్ని అవకాశంగా తీసుకుని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. కొద్దిసేపటికి బస్టాండ్‌కు వచ్చిన ప్రయాణికులు యువతి వివస్త్రగా ఉండడాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు. బస్టాండ్​ వద్ద సీసీ ఫుటేజీని పరిశీలించారు. చేవెళ్లకు చెందిన అనిల్‌ కుమార్‌, రాజులు అత్యాచారం చేసినట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

"మాకు ఆదివారం రాత్రి.. ఓ అమ్మాయి చేవెళ్ల బస్టాండ్ వద్ద నగ్నంగా కనిపించిందని.. ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందని స్థానికుల నుంచి సమాచారం అందింది. వెంటనే మేం అక్కడికి వెళ్లాం. మేం అక్కడికి వెళ్లే సరికి ఆమె స్పృహలో లేదు. వెంటనే యువతిని ఆస్పత్రికి తరలించాం. వైద్యులు చికిత్స చేసి ఆమెపై అత్యాచారం జరిగిందని చెప్పారు. ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత విచారిస్తే ఇద్దరు వ్యక్తులు రేప్ చేసినట్లు చెప్పింది. తాను మద్యం, నిద్ర మత్తులో ఉండటం వల్ల ప్రతిఘటించలేకపోయానని చెప్పింది. రాత్రి కావడం ఆ సమయంలో బస్టాండ్ వద్ద ఎవరూ లేరని తెలిపింది. బస్టాండ్ చుట్టు పక్కల పరిశీలించిన మేం అక్కడ సీసీ కెమెరాను గుర్తించాం. వెంటనే సీసీటీవీ ఫుటేజీ పరిశీలించాం. ఈ ఫుటేజీలో ఇద్దరు వ్యక్తులను గుర్తించి విచారించగా వారు అత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నారు. మేం వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించాం" అని చేవెళ్ల పోలీసులు తెలిపారు.

Sexual Harassment on Minor Girls in Hyderabad : చాక్లెట్ ఆశచూపించి మైనర్​ బాలికల పట్ల అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై పోక్సో కేసు

Meerpet Girl Gang Rape Case : మీర్​పేట్ గ్యాంగ్​ రేప్​ కేసు.. ఏడుగురు నిందితుల అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details