Young woman kidnapped in adibatla: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సినీ ఫక్కీలో దౌర్జన్యం చోటు చేసుకుంది. మన్నెగూడలో దంత వైద్యురాలి ఇంటిపై వందమందికిపైగా దుండగులు దాడి చేసి అడ్డొచ్చిన తల్లిదండ్రులను... కర్రలతో కొట్టి.. అపహరించుకుపోయారు. దంతవైద్యురాలి ఇంట్లో సీసీ కెమెరాలు, సామగ్రి, కార్లను దుండగులు ధ్వంసం చేశారు.
సినిమా తరహాలో యువతి కిడ్నాప్.. 100 మందితో వచ్చి... - Young woman kidnapped in adibatla
Young woman kidnapped in adibatla: ఇప్పటి వరకు సినిమాల్లోనే చూసి ఉంటాం. పెద్ద సంఖ్యలో ఇంటిపై దాడి చేసి.. అడ్డొచ్చిన వాళ్లను చితకబాది.. కిడ్నాప్‌లకు పాల్పడటం. హైదరాబాద్ ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో... ఇదే తరహాలో దంతవైద్యురాలైన ఓ యువతి ఇంటిపై... పట్టపగలు వందమందికిపైగా కిడ్నాపర్లు దాడి చేశారు. అంతా చూస్తుండగానే యువతిని కార్లో అపహరించుకుపోయారు. దీంతో నగరశివారులో కలకలం చోటు చేసుకుంది.
![సినిమా తరహాలో యువతి కిడ్నాప్.. 100 మందితో వచ్చి... girl kidnap in manneguda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17159301-thumbnail-3x2-keeee.jpg)
డీసీఎం, కార్లలో నవీన్‌రెడ్డి తీసుకువచ్చి దాడి చేయించాడని.. యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గతంలో నవీన్‌రెడ్డిపై ఆదిభట్ల పీఎస్‌లో.. ఫిర్యాదు చేసినా పోలీసులు అడ్డుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అపహరణ ఘటన సమాచారం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వర్.. ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ.. యువతి బంధువులు... సాగర్ రింగ్ వద్ద ఆందోళన చేపట్టారు. కిడ్నాపర్లను గుర్తించి.. వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు.