రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్టేషన్ ముందు హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌పై ఓ యువకుడు హల్చల్ చేశాడు. మద్యం మత్తులో వాహనం నడుపుతూ... గత నెల 28న ట్రాఫిక్ పోలీసులకు నాగరాజు పట్టుబడ్డాడు. తన వాహనాన్ని తనకు ఇవ్వకుండా పోలీస్‌స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారని ఆరోపిస్తూ ఫ్లైఓవర్‌పై నుంచి దూకుతానని బెదిరించాడు.
నా ఆటో ఇవ్వకపోతే..ఫ్లైఓవర్ నుంచి దూకేస్తా.. - Shamshabad airport police station news
ట్రాఫిక్ పోలీసులు తన వాహనం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఓ వ్యక్తి ఫ్లైఓవర్‌పై నుంచి దూకుతానని బెదిరించిన ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్ ముందు చోటుచేసుకుంది.
![నా ఆటో ఇవ్వకపోతే..ఫ్లైఓవర్ నుంచి దూకేస్తా.. Young man hull chull](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11251239-723-11251239-1617355898365.jpg)
ఫ్లైఓవర్‌పై యువకుడి హల్చల్
భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడగా ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు... నాగరాజుకు సర్దిచెప్పి కిందకు దించారు. ట్రాఫిక్ రూల్స్‌కి వ్యతిరేకంగా వాహనాన్ని నడపడమే కాకుండా పోలీసులను బెదిరిస్తున్నాడని అతనిపై కేసు నమోదు చేశారు.
ఫ్లైఓవర్‌పై యువకుడి హల్చల్
- ఇదీ చదవండి :ఖమ్మంలో కేటీఆర్.. ఐటీ హబ్ రెండో దశకు అంకురార్పణ