తెలంగాణ

telangana

ETV Bharat / state

World Heart Day: 'ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి'

హైదరాబాద్ అవేర్ గ్లోబల్ హాస్పిటల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రపంచ గుండె దినోత్సవం నిర్వహించారు. గుండె వ్యాధులకు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధించి డాక్టర్ల సలహాలు, సూచనలు ఇచ్చారు.

World Heart Day
World Heart Day

By

Published : Sep 30, 2021, 4:58 AM IST

హైదరాబాద్ అవేర్ గ్లోబల్ హాస్పిటల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రపంచ గుండె దినోత్సవం నిర్వహించారు. గుండె వ్యాధులకు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధించి డాక్టర్ల సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరని.. గుండె నొప్పిగా ఉన్నప్పుడు వెంటనే డాక్టర్​ను సంప్రదించాలని సూచించారు.

గుండె సంబంధిత వ్యాధితో లక్షలాది మంది మరణిస్తున్నారని అందువల్ల ఈ సమస్య గురించి అవగాహన కల్పించవలసిన బాధ్యత ఆరోగ్య సేవలు అందించే వ్యవస్థలో ఉన్న వారి అందరిపై ఉందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హార్ట్ ఫెయిల్యూర్ కేసులకు సైతం చికిత్స చేసేందుకు అత్యాధునిక చికిత్సలు ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయని అన్నారు.

సమాజంలోని అల్పాదాయ వర్గాలకు చెందిన కుటుంబాలకు లబ్ధి చేకూరే విధంగా నూతన ప్యాకేజీని ప్రారంభించడం జరిగిందని ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. నగరంలోని అత్యుత్తమ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు అవేర్ గ్లోబల్ హాస్పిటల్ ఒకటని సమగ్రమైన, సమర్థవంతమైన కార్డియాలజీ, కార్డియోథొరాసిక్, వాస్కులర్ సర్జరీ బృందం అందుబాటులో ఉందని తెలిపారు.

ఇవీ చూడండి:

SAI DHARAM TEJ: తేజ్​ ప్రమాద దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​.. కారణాలివే.!

ABOUT THE AUTHOR

...view details