రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ఎల్వర్తి గేడు సమీపంలో మారుతి స్విఫ్టు కారు ఢీకొని మహిళ మృతి చెందింది. మృతురాలు కొజ్జగూడ గ్రామానికి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. వేగంగా కారు నడుపుతూ.. డివైడర్ను ఢీకొని అదుపు తప్పి పొలంలో పని చేసుకొని తిరిగి వస్తున్న మహిళను ఢీకొట్టింది. బలమైన గాయాలతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలిని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శంకర్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
శంకర్పల్లిలో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి - రంగారెడ్డి జిల్లా వార్తలు
మారుతి స్విఫ్టు కారు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ఎల్వర్తి గేటు సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
![శంకర్పల్లిలో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి women die in road accident in rangareddy district shankarpally](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7894787-662-7894787-1593882720260.jpg)
శంకర్పల్లిలో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి