రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పురపాలక సంఘం కార్యాలయంలో నూతన కో-ఆప్షన్ సభ్యురాలు గుంటి శకుంతల బెస్త బాధ్యతలు స్వీకరించారు. తన భర్త కీర్తి శేషులు గుంటి సత్యనారాయణ బెస్త, గతంలో ఇబ్రహీంపట్నం మండల ప్రజా పరిషత్ ఛైర్మన్‌గా విధులు నిర్వర్తించారని శకుంతల గుర్తు చేసుకున్నారు. ప్రజలందరికీ విద్య, వైద్యం అందాలని ఆయన అనుక్షణం తపించేవారని పేర్కొన్నారు. సత్యనారాయణ ఆశయాలను తాము కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. తాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి : గుంటి శకుంతల బెస్త - Gunti Shakuntala Bestha latest News
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పురపాలక సంఘం నూతన కో-ఆప్షన్ మెంబర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గుంటి శకుంతల బెస్త బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పుర అధ్యక్షురాలు స్రవంతి, ఉపాధ్యక్షుడు ఆకుల యాదగిరికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి : గుంటి శకుంతల బెస్త