తెలంగాణ

telangana

ETV Bharat / state

మద్యం మత్తు: కత్తితో భర్త గుండెల్లో పొడిచి చంపిన భార్య - rangareddy latest news

wife murdered his husband in rangareddy district of rajendranagar
మద్యం మత్తు: కత్తితో భర్త గుండెల్లో పొడిచిన భార్య

By

Published : Sep 6, 2020, 6:27 AM IST

Updated : Sep 6, 2020, 12:16 PM IST

06:24 September 06

మద్యం మత్తు: కత్తితో భర్త గుండెల్లో పొడిచి చంపిన భార్య

మద్యం మత్తులో ఉన్న భార్య.. తన భర్తను కత్తితో పొడిచి చంపింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటుచేసుకొంది. తీవ్రగాయాలపాలైన భర్త విశాల్​ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందాడు.  

గుండెల్లో పొడిచింది..

ఉత్తరాఖండ్​కు చెందిన విశాల్, సబీనా గతంలో ఆర్మీలో పనిచేసి.. రిటైర్​ అయ్యారు. అనంతరం బండ్లగూడ సన్​సిటీలోని మాపిల్​టౌన్​ విల్లాస్​లో నివాసం ఏర్పాటుచేసుకున్నారు. ఆర్మీలో రిటైర్​మెంట్​ అనంతరం సబీనా వైద్యురాలిగా.. విశాల్​ ఓ ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలో ఉద్యోగం చేస్తున్నారు.  

గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ప్రారంభమైనట్లు సమాచారం. శనివారం రాత్రి వీరిద్దరూ కలిసి మద్యం సేవించారు. అనంతరం మాటామాటా పెరిగి.. మళ్లీ గొడవకు దిగారు. కోపోద్రిక్తురాలైన సబీనా.. ఇంట్లో ఉన్న కత్తితో భర్త గుండెల్లో పొడిచింది. తీవ్రగాయాలపాలైన విశాల్​.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందాడు. వీరిద్దరిదీ రెండో వివాహమే.  

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసుకొని సబీనాను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.  

ఇవీచూడండి:దారుణం: నాలుగేళ్ల చిన్నారిని అపహరించి అత్యాచారం

Last Updated : Sep 6, 2020, 12:16 PM IST

ABOUT THE AUTHOR

...view details