రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం చిప్పలపల్లిలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాసోజీ జంగయ్య చారి-కృష్ణవేణి దంపతులకు నలుగురు కుమార్తెలు. ముగ్గురి వివాహం కాగా... చిన్న కూతురు డిగ్రీ చదువుతోంది.
భార్యాభర్తలను బలిగొన్న కుటుంబ కలహాలు... - wife murder husband sucide with family conflicts in chippalapalli
కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా చిప్పలపల్లిలో చోటుచేసుకుంది. మృతదేహాలను శవపరీక్ష కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

కుటుంబ కలహాలతో భార్య హత్య.. భర్త ఆత్మహత్య
జంగయ్య-కృష్ణవేణి గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుటుంబ కలహాలతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతదేహాలను శవపరీక్ష కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
భార్యాభర్తలను బలిగొన్న కుటుంబ కలహాలు...
ఇదీ చూడండి:హైదరాబాద్లో సైబర్ నేరాలకు చెక్ పెట్టే.. జాతీయ స్థాయి సెంటర్