రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీఎస్ పరిధి సులేమాన్ నగర్ నివాసి అయిన యూనిస్ ఖాన్ 9ఏళ్ల క్రితం వికారాబాద్‌కు చెందిన షాహిదా బేగంను వివాహం చేసుకున్నాడు. వీరికి నలుగురు సంతానం. అయితే కరోనా లాక్డౌన్ నేపథ్యంలో షాహిదా బేగం పుట్టింటికి వెళ్తానని భర్తను అడగగా అందుకు యూనిస్ ఖాన్ ఒప్పుకోలేదు. దీనితో తీవ్ర మనస్తాపానికి గురైన షాహిదా బేగం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పుట్టింటికి పంపలేదని మహిళ ఆత్మహత్య - wife committed suicide in Rangareddy District
కరోనా లాక్డౌన్ ఓ వివాహిత ఆత్మహత్యకు దారితీసింది. పుట్టింటికి వెళ్తానని భార్య అనడం.. దానికి భర్త ఒప్పుకోకపోవడం వల్ల ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు.
పుట్టింటికి పంపలేదని భార్య ఆత్మహత్య
Last Updated : May 16, 2020, 5:40 PM IST