రంగారెడ్డి జిల్లా మంచాల మండలం కాగజ్గట్ గ్రామానికి చెందిన దూసరి వెంకటేశ్ గౌడ్, కందుకూరి అరుణలు ప్రేమించుకొని.. కులాంతర వివాహం చేసుకున్నారు. యాచారం మండలం మాల్లో 3 నెలల కింద కాపురం పెట్టారు. వారం రోజులుగా వెంకటేశ్ ఇంటికి రాకపోవడం వల్ల అరుణ అత్త వారి ఇంటికి చేరుకుంది. అత్తింటివారు దాడి చేయడం వల్ల ఆమె అక్కడే నిరాహారదీక్ష దిగింది. తన భర్త ఆచూకీ తెలిపి తనకు న్యాయం చేయాలని అరుణ కోరుతోంది.
ప్రేమ వివాహం... మూణ్నెళ్లకే మొహం చాటేసిన భర్త - Love Marriage Women cheating
ప్రేమ వివాహం చేసుకొని 3 నెలలు కాపురం చేసి భార్యను వదిలేశాడో భర్త. తనకు న్యాయం చేయాలంటూ ఆ మహిళ అత్తింటి ఎదుట నిరాహార దీక్షకు దిగింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మంచాలలో జరిగింది.

మహిళ ఆందోళన