తెలంగాణ

telangana

By

Published : Oct 31, 2019, 12:18 PM IST

Updated : Oct 31, 2019, 4:29 PM IST

ETV Bharat / state

కీర్తి క్రిమినల్ ఎందుకయింది?

కీర్తి పేరు పెట్టుకున్న కూతురు తల్లినే చంపి ఇంతటి అపకీర్తిని ఎందుకు తెచ్చుకుంది? కల్మషం లేకుండా ఉండాల్సిన పిల్లల మనసులు ఓ మనిషిని చంపేంత క్రూరంగా ఎలా ఆలోచిస్తున్నాయి? దీనికి కారణం తల్లిదండ్రులా? తెలిసో తెలియకో వారి మనస్సులను విద్వేషాలతో నింపుతున్నారా?

రంగారెడ్డిలో తల్లిని చంపిన కూతురు కీర్తి

రంగారెడ్డిలో తల్లిని చంపిన కూతురు కీర్తి

కీర్తి అంటే యశస్సు, గొప్పతనం వంటి పదాలు గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు కీర్తి అంటే మునగనూరులో తల్లిని చంపేసి.. ఆ నేరాన్ని తండ్రిపై నెట్టిన ఓ అమ్మాయి మన కళ్లముందు మెదులుతోంది. పిల్లల మనసు అసలెందుకింత విషపూరితం అవుతోంది.

వినోదాన్ని పంచే రీతుల్లో వ్యత్యాసం...

నిన్న మొన్నటిదాకా చందమామ, బాలమిత్ర కథలు, సత్య హరిశ్చంద్ర, రామాయణ భారత కథలు వంటివి వినోదాన్నిచ్చే పాఠాలు, నైతిక సూత్రాలు. ఈ కాలంలో వినోదమంటే కుటుంబంలో ఒకరిపై మరొకరు విద్వేషాలు పెంచుకునే సీరియళ్లు, మనుషుల్ని చంపుకునే వీడియో గేమ్​లు, క్రైమ్ న్యూస్​లు. వీటిని ప్రోత్సహించి తెలియకుండానే పిల్లల మనసుల్లో విషం ఎక్కిస్తున్నారు చాలామంది తల్లిదండ్రులు.

ఈ సమస్యలకు పరిష్కారం తల్లితండ్రుల చేతుల్లోనే ఉంది. పిల్లలు ఏం చేస్తున్నారు.. ఏం చూస్తున్నారు అనే అంశాలపై ఓ కన్నేయాలి.

ఏ విషయాలపై శ్రద్ధ పెట్టాలంటే...

  • స్మార్ట్ ఫోన్లు, ఇంటర్​నెట్​లో ఏం చూస్తున్నారో తెలుసుకోవాలి.
  • మంచి పుస్తకాలను చదివించాలి.
  • వారితో కొంత సమయం గడపుతూ స్నేహితుల్లా ఉండాలి.
  • పిల్లలు లక్ష్యసాధన వైపు సాగిపోయేందుకు మంచిమార్గం చూపాలి.
  • వారిచేత కచ్చితంగా చందమామ, బాలమిత్ర నీతి కథలు, సత్య హరిశ్చంద్ర, రామాయణ, మహాభారత కథలు చదవించి... అర్థం చేయించాలి.
  • భారతదేశం కోసం ప్రాణాలర్పించిన వారి గాథలు చెబుతూ దాని నుంచి మనమేం నేర్చుకోగలమో వివరించాలి.

ఇలాంటివన్నీ పిల్లలకు నేర్పిస్తూ తల్లిదండ్రులు నేటితరం పిల్లల్లో కొత్త శకాన్ని రూపొందించవచ్చు. అలాంటి మంచిపనికి శుభతరుణాలను చూడక ఇవాళే మెదలు పెట్టండి మరి..!

Last Updated : Oct 31, 2019, 4:29 PM IST

ABOUT THE AUTHOR

...view details