తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్తపేట పండ్ల మార్కెట్​లో తూకాల్లో తేడాలు.. 18 మంది వ్యాపారులపై కేసులు - gaddiannaram fruit market

కొత్తపేట గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌లో తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తూకాల్లో మోసాలపై ఫిర్యాదులు రావడంతో అధికారులు సోదాలు చేపట్టారు. తేడాలు ఉండటంతో 18 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారు.

gaddiannaram market news, weight checking Cases against 18 traders
తూకాల్లో తేడాలు.. 18 మంది వ్యాపారులపై కేసులు

By

Published : Apr 9, 2021, 11:11 AM IST

రంగారెడ్డి జిల్లా‌ కొత్తపేటలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌లో....తనిఖీలు చేపట్టారు. మామిడి సీజన్‌ కావడం వల్ల తూకాల్లో మోసానికి పాల్పడుతున్నారన్న ఫిర్యాదు మేరకు..... పండ్ల మార్కెట్‌లో తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

తూకాల్లో తేడాలు ఉండటంతో 18 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. తూకాల్లో మోసాలకు పాల్పడితే ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా అధికారి జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో సోదాలు జరిపారు.

ఇదీ చూడండి :ముగ్గురు మిత్రుల్లో ప్రేమ ముసలం!

ABOUT THE AUTHOR

...view details