తెలంగాణ

telangana

By

Published : Nov 4, 2020, 5:34 PM IST

ETV Bharat / state

విచారణ జరిపి పరిహారం అందజేస్తాం: సబితా ఇంద్రా రెడ్డి

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలకు రైతు వారీగా విచారణ జరిపి పరిహారం అందజేస్తామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా పరిషత్​ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు.

we will give compensation to farmers: sabitha indra reddy
విచారణ జరిపి పరిహారం అందజేస్తాం: సబితా ఇంద్రా రెడ్డి

రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్మన్​ తీగల అనితా రెడ్డి అధ్యక్షతన జిల్లా పరిషత్​ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పాల్గొన్నారు. ​ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలకు రైతు వారీగా విచారణ జరిపి పరిహారం అందజేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం స్పందించకున్నా రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి పరిహారం అందిస్తోందని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో అక్రమంగా వెలుస్తున్న వెంచర్లపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

ఫించన్లు, రుణమాఫీ, రైతు బంధు విషయంలో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయని పలువురు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు మంత్రి దృష్టి తీసుకొచ్చారు. అలాగే ఫార్మాసిటీ భూముల విషయంలోనూ కాసేపు వాడీవేడిగా చర్చ జరిగింది. స్పందించిన మంత్రి ఫార్మా సిటీ భూములపై త్వరలోనే ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. కరోనా కారణంగా రాష్ట్రానికి రావల్సిన ఆదాయం తగ్గడం వల్ల రైతుబంధు, రుణమాఫీ విషయంలో ఆలస్యం జరుగుతుందన్న సబితా ఇంద్రారెడ్డి... జిల్లాలోని రైతుల పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

ఇదీ చదవండి:ఆమె ఒక్కరే... ఆ నలుగురూ!

ABOUT THE AUTHOR

...view details