రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్‌షో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందన్నారు.
'అధికారంలోకి వచ్చిన తర్వాత తిన్నదంతా కక్కిస్తాం' - రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ
తుర్కయంజాల్, పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీల పరిధిలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తిన్నదంతా కక్కిస్తామని తెరాస ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
!['అధికారంలోకి వచ్చిన తర్వాత తిన్నదంతా కక్కిస్తాం' We will eat everything after coming to power mp komatireddy venkat reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5769622-1024-5769622-1579471688964.jpg)
'అధికారంలోకి వచ్చిన తర్వాత తిన్నదంతా కక్కిస్తాం'
వచ్చే నాలుగేళ్లలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్, కేటీఆర్‌లను దోషులుగా నిలబెడతామని అన్నారు.తుర్కయంజాల్, పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీల పరిధిలో రోడ్‌షో నిర్వహించిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థులు, కార్యకర్తల్లో నూతన ఉత్తేజం నింపే ప్రయత్నం చేశారు.
'అధికారంలోకి వచ్చిన తర్వాత తిన్నదంతా కక్కిస్తాం'
ఇదీ చూడండి : 'ఓటర్లను మంత్రి ఎర్రబెల్లి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు'
Last Updated : Jan 20, 2020, 6:58 AM IST